హైదరాబాద్,(విజయక్రాంతి): ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసు(Formula E-Car Racing Case)లో హెచ్‌ఎండీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బీఎల్ఎన్ రెడ్డి(HMDA Chief Executive BLN Reddy) విచారణ మగిసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) ఎదుట హాజరైన బీఎల్ఎన్ రెడ్డిని సుదీర్ఘంగా 9.30 గంటలపాటు విచారణ కొనసాగించింది. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నాలకు బీఎల్ఎన్ రెడ్డి సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక సూత్రధారిగా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి(BLS Reddy) రూ.55 కోట్ల నిధులు ఎఫ్ఈఓకి బదిలీకి చేశారు. ఏసీబీ కేసు ఆధారంగా మనీలాండరింగ్ చట్టం(Money Laundering Act) కింద ఈడీ(ED) కేసు దర్యాప్తు చేసింది.