calender_icon.png 28 November, 2024 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద వైద్య విద్యార్థుల సంక్షేమానికి బిఎల్ఆర్ ట్రస్ట్ కృషి హర్షణీయం

28-11-2024 06:03:36 PM

కాప్రా,(విజయక్రాంతి): పేద వైద్య విద్యార్థుల సంక్షేమానికి బిఎల్ఆర్ ట్రస్ట్ కృషి హర్షనీయమని హిందూపూర్ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. కాప్రా సర్కిల్, నాచారం డివిజన్ పరిధిలోని హపర్ మార్ట్ ప్రారంభోత్సవంలో బాలకృష్ణ బిఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి నలుగురు పేద వైద్య విద్యార్థులకు బిఎల్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేస్తున్న ఫీజులకు సంబంధించి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ పేద వైద్య విద్యార్థులలో కు ఫీజులను మొత్తం బిఎల్ఆర్ టెస్ట్ చెల్లించడం అభినందనీయమని, విద్యార్థులకు బాసటగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నిలబడటం హర్షణీయమన్నారు.

ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమం వేగవంతం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని  పేద విద్యార్థులకు బిఎల్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సౌకర్యాలు కల్పిస్తున్నామని, వైద్య విద్యార్థులకు బిఆర్ ట్రస్ట్ ఫీజులను చెల్లిస్తుందన్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉపాధి శిక్షణ తరగతులను గతంలో ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో నాచారం, మల్లాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు శాంతిసాయిజయ శేఖర్, పాన్నాల దేవేందర్ రెడ్డి, నాయకులు ప్రవీణ్ ముదిరాజ్,  సాయి జన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.