calender_icon.png 23 January, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెత్తురోడిన కన్నడ రహదారులు

23-01-2025 01:17:40 AM

15 మంది మృతి, 25 మందికి గాయాలు

బెంగళూరు, జనవరి 22: కన్నడనాట ర హదారులు రక్తసిక్తమయ్యాయి. కర్వార్, రా యచూర్ జిల్లాల్లో బుధవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 15 మంది మృత్యువాత పడగా.. మరో 25 మంది వ రకు గాయపడ్డారు. గంటల వ్యవధిలో ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 

ఏపీ వాసులు మృతి

హంపిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏ పీకి చెందిన విద్యార్థులు మృతి చెందారు. వే ద పాఠశాలకు చెందిన విద్యార్థులు హంపి క్షే త్రానికి బయల్దేరగా.. మార్గమధ్యంలో ప్ర మాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు విద్యార్థలు మరణించారు.

ఏపీ విద్యార్థుల మృతి బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నా రు. రోడ్డు ప్రమాదాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్రహోం మంత్రి అమిత్ షాతో పాటు.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మృతుల కుటుం బాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.