calender_icon.png 21 October, 2024 | 3:29 AM

బ్లడీ బెగ్గర్ సందడి

21-10-2024 12:31:59 AM

 కెవిన్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పేరు. ఈ యువ కథానాయకుడు తమిళ సిని మా ఇండస్ట్రీలో ఫేమస్. గతంలో తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్న అందమైన కుర్రాడు. ఆ తర్వాత హీరోగా మారాడు. ‘నాట్పున ఎన్నను తెరియుమా’, ‘లిఫ్ట్’, ‘దాదా’, ‘స్టార్’ సినిమాలతో మెప్పించా డు. కెవిన్ నటించిన కొన్ని సినిమాలు తెలుగులోనూ అనువాదమయ్యాయి.

తన పాత్ర కోసం ఎంతకైనా సిద్ధమయ్యే కెవిన్ ఇప్పుడు యాచకుడి గెటప్‌లో ఆకట్టుకుంటున్నాడు. శివబాలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్లడీ బెగ్గర్’ సినిమా కోసం ఈ వేషం వేశాడు కెవిన్. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజైంది. ఇందులో కెవిన్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. బెగ్గర్ పాత్రలో జీవించాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ నిర్మాతగా వ్యవహరిస్తునన ఈ సినిమా తమిళ వెర్షన్ దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఓటీటీలో తెలుగు వెర్షన్ కూడా రిలీజయ్యే అవకాశముంది.