calender_icon.png 26 December, 2024 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

27న థియేటర్లలో బ్లడ్

25-12-2024 12:38:46 AM

హారర్, సస్పెన్స్, కామెడీ కథా చిత్రాలకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఆ కోవలో విభిన్నంగా తెరక్కెక్కించిన చిత్రం ‘బ్లడ్’. అవధూత గోపాల్ దర్శక, నిర్మాతగా తీసిన చిత్రమిది.  గౌరవ్ హీరోగా, గోపాలరావు, నందినీ కపూర్, జబర్దస్త్ వినోదిని, రాకింగ్ రాకేశ్, ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాన్ని మేకర్స్ మంగళవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా అతిథులుగా విచ్చేసిన దర్శకుడు రేలంగి నరసింహారావు, నటులు ‘జబర్దస్త్’ అప్పారావు, విజయభాస్కర్ విచ్చేశారు. చిత్రం ప్రోమోలను ఆవిష్కరించారు. ‘జబర్దస్త్’ వినోదిని, ‘జబర్దస్త్’ చిట్టిబాబు, నటులు కొల్హాపూర్ రామచంద్రగౌడ్, ఆనందభారతి, కొల్హాపూర్ రామకృష్ణ ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్‌ను విడుదల చేశారు.