24 May, 2026 | 6:58 PM

సమాజ హితానికి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి

24-05-2026 05:27 PM

తల సేమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం విజయవంతం

146 యూనిట్ల రక్త సేకరణ

 రక్తదానంకు ముందుకు వచ్చిన యువతకు హెల్మెట్ల పంపిణీ: పట్టణ సీఐ నరహరి

కామారెడ్డి,(విజయక్రాంతి): సమాజ హితం కోసం యువత ముందుకు రావడం అభినందనీయమని కామారెడ్డి పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి అన్నారు. ఆదివారం కామారెడ్డి ఆదిత్య ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరం నిర్వహించిన రక్తదాతల సమూహం నిర్వాహకులను సిఐ అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న పిల్లల ప్రాణాలను కాపాడడం కోసం ఆదిత్య హాస్పిటల్ నిర్వాహకులు చిలువేరి మారుతి, డాక్టర్ అజయ్ పేరాల, బాలు రక్తదానం శిబిరం నిర్వహించేందుకు ముందుకు వచ్చి విజయవంతం చేసినందుకు అభినందించారు.

రక్తదానం చేస్తారా రక్తదాతలకు ట్రాఫిక్ నిబంధన పట్ల అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఖర్చుకు వెనుకడుగు వేయకుండా హెల్మెట్లను అందజేయడం సామాజిక బాధ్యత నిదర్శనం అన్నారు. యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని రక్తదానం పట్ల ఉన్నా అపోహలను విడనాడాలని కోరారు.  కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆదిత్య హాస్పిటల్ సహకారంతో,కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్), ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఆదిత్య హాస్పిటల్ నిర్వాహకులు చిలువేరి మారుతి లు పేర్కొనడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇచ్చిన కామారెడ్డి పట్టణ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నరహరి మాట్లాడుతూ చిన్న పిల్లల ప్రాణాలను కాపాడడం కోసం ఆదిత్య హాస్పిటల్ నిర్వాహకులు చిలువేరి మారుతి,డాక్టర్ అజయ్ పేరాల,డాక్టర్ ఎన్ బాలు మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని, రక్తదానం చేసిన రక్త దాతలకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఖర్చు వెనకడుగు వేయకుండా హెల్మెట్లను అందజేయడం సామాజిక బాధ్యత కు నిదర్శనమని అన్నారు యువత రక్త దానం చేయడానికి ముందుకు రావాలని రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాలి సమాజ హితం కోసము ముందుకు కదలాలని అన్నారు రక్తదానం చేసిన రక్త దాతలకు ప్రశంసా పత్రాలను హెల్మెట్లను బహూకరించడం జరిగింది.