22-04-2025 01:34:23 AM
కామారెడ్డి, ఏప్రిల్ 21( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపేట్ గ్రామానికి చెందిన బాలవ్వ (68) కు సోమవారం అత్యవసరంగా ప్రభుత్వ వైద్యశాల కామారెడ్డిలో ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తాన్ని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు జిజిహెచ్ రక్తనిధి కేంద్రంలో 76వ సారి రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేసే వారిలో గుండెపోటు, కొలెస్ట్రాల్,క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం చాలా వరకు తక్కువ అని అన్నారు. తలసేమియా చిన్నారుల కోసం,ప్రభుత్వ వైద్యశాలలోని రక్తనిధి కేంద్రాలకు కావలసిన రక్తాన్ని అందజేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్,బుక్క రజనిబాలు, టెక్నీషియన్ ప్రమోద్ లు పాల్గొన్నారు.