26-03-2025 01:30:34 AM
హుజూర్ నగర్, మార్చి 25: ధనంతో కొనలేని ఏకైక వస్తువు రక్తం, ఒక మనిషికి ఇంకో మనిషి మాత్రమే దానం చేసేదే రక్తదానం అని నిరూపిస్తూ..హుజుర్ నగర్ పట్టణంలోనీ ఒక ప్రయివేట్ హాస్పటల్ లో ఒక మహిళకు బి పాజిటివ్ రక్తం అత్య వసరం అవగా జనచైతన్య ట్రస్ట్ నిర్వాహ కులకు సమాచారం అందడంతో స్పందిం చిన ట్రస్ట్ అధ్యక్షుడు పారా సాయి బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ డోనర్ విజయ్ తో మాట్లాడి హాస్పిటల్ వద్దకు పంపించి, బ్లడ్ బ్యాంకు నందు బి పాజిటివ్ బ్లడ్ రక్తదానం చేపించడం జరిగింది.
ఈ సందర్బంగా పారా సాయి మాట్లాడుతూ రక్తదానం అనేది చాలా గొప్ప పని మనం రక్తాన్ని సృష్టించ లేం దానం మాత్రమే చేయగలం. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సంవత్స రానికి రెండు మూడు సార్లు రక్తదానం చేయొచ్చు,మీరు చేస్తున్న రక్తదానం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని,ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి నిండు ప్రాణాలను కాపాడాలని అన్నారు.ఈరోజు రక్తదానం చేసిన మిత్రుడు విజయ్ కి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.