calender_icon.png 7 March, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదానం

07-03-2025 12:00:00 AM

కామారెడ్డి అర్బన్, మార్చి 6 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం రెడ్ క్రాస్ సొసైటీ, కామారెడ్డి బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు  అత్యవస రంగా బ్లడ్ అవసరం ఉన్నందున  రక్త దాన శిబిరం ఏర్పాటు చేసి 50 యూనిట్ల బ్లడ్ సేకరించారు.

ఈ కార్యక్రమంలో సహకరిం చిన కామారెడ్డి బ్లడ్ డోనర్స్ అసోసియేషన్  అధ్యక్షులు కిరణ్ తోపాటు డోనర్ సభ్యు లను జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు చైర్మన్ రాజన్న, సెక్రటరీ రఘుకుమార్ వారిని  అభినందించారు. కామారెడ్డిలో బ్లడ్ లేక  ఎవరికీ ప్రాణహాని కాకూడదని అందు కు మీరందరూ సహకరిస్తూ, కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులుగా యువత ముందుకు వచ్చి సభ్యత్వాన్ని  స్వీకరించాలని వారు కోరారు. 

కొత్తగా పదిమంది చేరిన సభ్యులను ప్రత్యేకంగా పేరుపేరునా అభినం దించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం రాజన్న, సెక్రటరీ రఘు కుమార్, కామారెడ్డి  బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్, ఆర్గనైజర్లు శివ, పుట్ట చంద్రశేఖర్, విలాస్, శ్రీకాంత్, రాజు, రవి తదితరులు పాల్గొన్నారు.