calender_icon.png 28 March, 2025 | 1:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదాన శిబిరాలు నిర్వహించాలి

25-03-2025 05:22:17 PM

తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్..

మందమర్రి (విజయక్రాంతి): మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిది కేంద్రంలో రక్తం కొరత తీవ్రంగా ఉందని వెంటనే రక్తదాన శిబిరాలు నిర్వహించి తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలని తలసేమియా సికిల్ సెల్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్ కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిది కేంద్రంలో తల సేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు 832 మంది ఉన్నారని వీరికి ప్రతి 15 రోజులకు ఒకసారి రక్త మార్పిడి తప్పనిసరి అన్నారు.

రక్తనిది కేంద్రంలో రక్తం కొరత తీవ్రంగా ఉన్నందున వ్యాధిగ్రస్తుల సౌకర్యార్థం రక్తదాన శిబిరాలు నిర్వహించాలన్నారు. గత వేసవి కాలంలో రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించి వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచారని, ప్రస్తుతం వేసవి కావడం, విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతుండటంతో అనేకమంది రక్తదానానికి ముందుకురావడం లేదని దీనిని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలని ఆయన కోరారు.