calender_icon.png 25 January, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే రక్తదాన శిబిరం

24-01-2025 08:14:33 PM

భద్రాచలం (విజయక్రాంతి): ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఏర్పడి 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ చేసుకుంటున్న సందర్భంగా అలాగే జాతీయ అధ్యక్షులు షిండే  75 సంవత్సరాల జన్మదిన వేడుకలు పురస్కరించుకొని శుక్రవారం భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాల నందు రక్తదాన శిబిరాన్ని భద్రాచలం కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఈ రక్తదానం భారతదేశం మొత్తం ఒకేరోజు అన్ని రాష్ట్రాల్లో, 760 జిల్లాలలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భద్రాచలం కెమిస్ట్ సభ్యులు ప్రభుత్వ ఏరియా వైద్యశాల నందు 30 మంది సభ్యులు రక్తం దానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పి సోమశేఖర్, సిహెచ్ నాగేశ్వరరావు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.