01-03-2025 05:58:41 PM
మేడ్చల్ (విజయక్రాంతి): గుండ్లపోచంపల్లి పరిధిలోని నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి జె త్రిశూల్ రెడ్డి కోశాధికారి జె త్రిలోక్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కళాశాల సాక్(స్టూడెంట్ ఆక్టివిటీ సెంటర్) సామాజిక సేవా క్లబ్ వారు ఎంఎన్జె ఇన్స్టిట్యూట్ ఆ ఆన్కాలజీ అండ్ రీజినల్ కాన్సర్ సెంటర్ ఆధ్వర్యవంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల సిబ్బంది, విద్యార్థులు కలిపి సుమారు 150 మంది రక్త దానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్ జె నర్సింహారెడ్డి, కార్యదర్శి జె త్రిశూల్ రెడ్డి, కోశాధికారి త్రిలోక్ రెడ్డి, కళాశాల డైరెక్టర్ డా మోహన్, ప్రిన్సిపాల్ డా. ఆర్. లోకనాథం, ఎస్ ఏ సి కన్వీనర్ డా. పురుషోత్తమ ప్రసాద్, సమన్వయకర్త శైలజ రెడ్డి, పలు విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు.