calender_icon.png 25 October, 2024 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తం ఇవ్వండి.. ప్రాణం పోయండి

25-10-2024 07:17:03 PM

జనగామ వెస్ట్​ జోన్​ డీసీపీ రాజమహేంద్ర నాయక్​

జనగామ,(విజయక్రాంతి): రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణదానం చేసినట్లేనని జనగామ వెస్ట్​ జోన్​ డీసీపీ రాజమహేంద్రనాయక్​ అన్నారు. పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం జనగామలోని జూబ్లీ గార్డెన్స్​లో పోలీసు శాఖ, రెడ్​ క్రాస్​ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. డీసీపీ రాజమహేంద్రనాయక్​ శిబిరాన్ని ప్రారంభించి తాను మొదట రక్తదానం చేశారు. రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణాన్ని నిలపడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారన్నారు. రక్తదానంలో 221 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ పార్థసారథి, జనగామ సీఐ దామోదర్​రెడ్డి, నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్సైలు రాజేశ్, చెన్నకేశవులు, భరత్, శ్వేత, జనగామ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్​ లవకుమార్ రెడ్డి, ప్రముఖ వైద్యులు సీహెచ్.రాజమౌళి, రెడ్ క్రాస్ కార్యదర్శి, లయన్స్ మాజీ జిల్లా గవర్నర్ కన్న పరశురాములు,  డాక్టర్ పి.కరుణాకర్ రాజు, ఎం.దివ్య తదితరులు పాల్గొన్నారు.