24-03-2025 12:00:00 AM
ఆందోల్, మార్చి 23 :జోగిపేట పోలీస్ స్టేషన్ లొ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరాన్ని ఆదివారంనాడు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా70 పోలీసులు, యువకులు ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. భారతదేశ స్వాతం త్రం కోసం ప్రాణాలను అర్పించిన సమరయోధులు సుఖదే వ్, భగత్ సింగ్, రాజుగుర్ యొక్క వర్ధంతి సందర్భంగా నిర్వ హించిన మహా రక్తదాన శిబిరంలో ఆందోల్ మండలంలోని పరిసర ప్రాంతాల్లో గల యువకులు ఉత్సాహంగా తమ రక్తా న్ని దానం చేశారు.
నిత్యం అనేక రోడ్డు ప్రమాదాల కారణంగా, ఇతర అనారోగ్య కారణాల వల్ల ఎందరో మృత్యువాత పడు తున్నారని, వారికి సరైన సమయంలో రక్తం అందక చనిపో తున్నారని, అలాంటి వారి ప్రాణాలు కాపాడేందుకే ఈ రక్తదా న శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జోగిపేట ఎస్త్స్ర పాండు తెలిపారు. యువకులు రక్తాన్ని దానం చేయడం వల్ల మరొకరికి పునర్జన్మ ఇచ్చినవారు అవుతారని అన్నారు.
యువతరం రక్తం దానం చేయడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతారు అన్నారు.ఈ శిబిరంలో పాల్గొని రక్తదా నం చేసిన వారందరికీ సర్టిఫికెట్లను ఎస్‌ఐ పాండు అందజే శారు. రక్త దాతలకు ఎస్‌ఐ పాండు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుల్లు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.