calender_icon.png 20 April, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదాన శిబిరం

12-04-2025 07:02:33 PM

మంచిర్యాల (విజయక్రాంతి): భారత రాజ్యాంగ సృష్టికర్త, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని జైపూర్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈ డి) చిరంజీవి, డీజీఎం పంతులులి రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ ఓ అండ్ ఎం  జేఎన్ సింగ్, ఏజీఎం మదన్మోహన్, డీజీఎం శ్రీనివాస్, ఏఐటీయూసీ సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి, సిఎంఓ శ్రీనివాస్, ఎస్ సి వెంకటయ్య, ఎస్ ఈ పులి సురేష్, వై ఆర్ సి ఎస్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్, కే మాధవి, రజిత, రాజేష్, రవి వర్మ, శ్రీనివాస్ సుజాత, తదితరులు పాల్గొన్నారు.