10-04-2025 10:32:20 PM
కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ అన్నపూర్ణ మాట్లాడుతూ.. రక్తదానం చేయడం వల్ల మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని రక్తదానం చేసిన విద్యార్థులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ అన్నపూర్ణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మీర్జా, హిమాయత్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ టి హరీష్ అధ్యాపకులు నవీన్ కుమార్, ఆంజనేయులు, శ్రావణ్ కుమార్, సుధాకర్, ఏఎన్ఎం దేవయ్య, పవన్, సిబ్బంది పాల్గొన్నారు.