calender_icon.png 18 March, 2025 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్త దానం.. ఎంతోమందికి ప్రాణదానం

18-03-2025 12:22:56 AM

రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ 

మహబూబ్ నగర్ మార్చి 17 (విజయ క్రాంతి) : రక్తదానం చేయడం ద్వారా ఎంతోమందికి దానం చేసిన వారిగా ఉంటామని రెడ్ క్రాస్ చైర్మన్ లైన్ నటరాజ్ అన్నారు. స్వాతంత్ర సమరయోధులు  షహీద్ భగత్ సింగ్, రాజ గురు, సుక్దేవ్ అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ యూత్ ప్రాజెక్ట్ , నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టిస్టు, యాక్టివిస్టు ఆధ్వర్యంలో  సోమవారం రెడ్ క్రాస్ సమావేశ మందిరం లో నిర్వహించిన అంతర్జాతీయ రక్తదాన అవగాహన ప్రచారం, రక్త దాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఒక దేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 800 జిల్లాలు, 2400 రక్త దాన శిబిరాలు, 150000రక్త యూనిట్ల రక్తాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి 23వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు.  ఈ సందర్భంగా 114 మంది రక్త దానం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త బాబుల్ రెడ్డి, రక్త దాన శిబిరం నిర్వాహకులు నవ కాంత్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.