calender_icon.png 19 April, 2025 | 10:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండస్ట్రీలో చూడని క్లుమైక్స్‌తో..

07-04-2025 12:00:00 AM

నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో విజయశాంతి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్‌బజ్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయశాంతి, కళ్యాణ్‌రామ్‌తోపాటు టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్‌రామ్, విజయశాంతి ఈ మూవీ జర్నీకి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ముఖ్యంగా ఈ సినిమాలోని పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం తాను సిద్ధమైన తీరును వివరిస్తూ విజయశాంతి చెప్పిన మాటలు అందరిలో స్ఫూర్తి నింపేలా ఉన్నాయి. తాను 10 కిలోల బరువు తగ్గానని విజయశాంతి చెప్పారు. ‘కర్తవ్యం’ సినిమాలోలాగా ఫిట్‌గా కనిపించేందుకు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపారు. సుమారు ఏడాదిన్నరపాటు నోరు కట్టుకొని ఉండాల్సి వచ్చిందన్నారు. ‘ఈ సినిమా క్లుమైక్స్ ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎవరూ చూడనివిధంగా ఉంటుంది. చివరి 20 నిమిషాలు తల్లీకొడుకుల మధ్య అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలు భావోద్వేగపూర్వకంగా ఉంటాయి’ అని కళ్యాణ్‌రామ్ వివరించారు.

ఇదిలా ఉండగా శ్రీరామనవమి సంద ర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్‌రామ్, విజయశాంతి డైనమిక్ లుక్ ఆకట్టుకుంటోంది. సోహైల్ ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటి స్తున్న ఈ చిత్రానికి బీ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, రామ్‌ప్రసాద్ సినిమా టోగ్రఫీ, ఎడిటింగ్ తమ్మిరాజు, స్క్రీన్‌ప్లే శ్రీకాంత్ విస్సా నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 18న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.