calender_icon.png 16 November, 2024 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ దురుద్దేశంతోనే నిధుల అడ్డగింత

30-06-2024 12:00:00 AM

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి 

మహేశ్వరం, జూన్ 29: నియోజకవర్గ అభివృద్ధి కోసం మంజూరైన నిధులను కాం గ్రెస్ పార్టీ రాజకీయ దురుద్దేశంతోనే అడ్డుకుందని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజల సంక్షేమ కోసం పని చేయాలని మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి అన్నా రు. శనివారం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ రోడ్డు మార్గాన్ని ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం గడ్డం ఎన్‌క్లేవ్, అరవింద్ నగర్, శ్రీకృష్ణ నగర్, మారుతి నగర్, ఆదిత్య నగర్ బస్తీల్లో పర్యటించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘు, రామిడి రామిరెడ్డి, కార్పొరేటర్లు కాలనీ వాసులు పాల్గొన్నారు.