ప్రభుత్వ స్థల లబ్ధిదారులకు డ్రా ఎందుకని అధికారులను ప్రజాప్రతినిధులను నిలదీయండి
స్థలం ఉన్న నిరుపేదలందరికీ ఐదు లక్షలు మంజూరు చేయాలి...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న వార్డు సభలలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారి పేర్లు ప్రకటించబోతున్నారని సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్(Municipality Convener Jalal) అన్నారు. వార్డు సభల ద్వారా నిజమైన అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ముందుకు పోవడం హర్షనియమని అయినప్పటికీ ప్రభుత్వమే స్థలం ఇచ్చిన వెన్నెలనగర్ ప్రభుత్వ స్థల లబ్ధిదారులను పట్టణంలోనే వీరు నిరుపేదలని తేల్చింది. అలాంటప్పుడు వారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వడానికి అభ్యంతరమేంటని, వారిని డ్రాలో ఎందుకు వేయాలని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వం మంత్రులు ప్రజాప్రతినిధులు నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ప్రకటన హాస్యాస్పదంగా కనిపిస్తుందని కేవలం మాటల గారడితో కాలం వెళ్ళదీసేలా కనబడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వార్డు సభలలో 75 గజాల, 100 గజాల నిరుపేదలకు డ్రా లేకుండా ఇవ్వాలని వార్డు సభలను అడ్డుకోవాలని అధికారులను ప్రజాప్రతినిధులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరి సమస్య పరిష్కారం కోసం వారే తిరుగుబాటు చేస్తే తప్ప పరిష్కరించేలా పాలకుల విధానాలు కనబడడం లేదని ఆయన అన్నారు. పట్టణంలో నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు అందకపోతే ప్రభుత్వ కార్యాలయాలు ముందు ఆందోళన కూడా సిద్ధం కావాలని ఆయన తెలిపారు.