calender_icon.png 19 January, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐతో స్పామ్ కాల్స్‌కు అడ్డుకట్ట

06-10-2024 12:00:00 AM

ఏఐ అంటే అమెరికా, ఇండియా అని , ఏఐ అంటే  అయ్ అని, అయ్ అంటే  అమ్మ అని, దేశంలో  పిల్లలందరూ అయ్ అని  పుడుతున్నారని  ప్రధాని మోదీ అంటున్నారు  కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తో అక్రమాలు, సైబర్ నేరాలు  అరికట్టవచ్చని తెలపకపోవడం విడ్డ్డూరం. గత పదేళ్లుగా సైబర్ నేరాలు, క్రికెట్ బెట్టింగ్, ఆన్‌లైన్  జూదం,సైబర్  మోసాలకు అడ్డూ,అదుపు లేకుండా పోయింది. 

డిజిటల్ కరెన్సీ, యుపిఐ చెల్లింపులు వచ్చిన తర్వాత సైబర్ నేరాలు శరవేగంగా సాగుతున్నాయి. ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీటికి చెక్ పెట్టాల్సిన  ప్రభుత్వాలు దీనికి  భిన్నంగా ప్రవ ర్తిస్తుండటంతో సామాన్యుల మొదలుకొని సంపన్నుల వరకు కోట్లల్లో   నష్టపో తున్నారు. దేశంలో పది మందిలో తొమ్మిది మంది ప్రతి రోజు వారి మొబై ల్ ఫోన్లలో స్పామ్ టెక్స్‌సందేశాలను స్వీకరిస్తున్నారు.

స్పామ్ కాల్స్ విషయం లో భారత్ ప్రపంచవ్యాప్తంగా నాల్గవ స్థానంలో ఉంది. స్పామ్‌కాల్స్ ద్వారా రోజు సమయం వృధా పోవడమే కాకుం డా   ఆర్థిక మోసాలు, స్కామ్‌లు, అయాచిత ఫోన్ కాల్స్ల్ లేదా సందేశాల ద్వారా ఉత్పన్నమవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ద్వారా నడిచే స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్‌ను తక్షణమే అన్ని టెలి కాం కంపెనీలు ప్రారంభించాలి. 

మొదలుపెట్టిన ఎయిర్‌టెల్

మొబైల్ నెట్‌వర్క్, ఏఐ , కంపెనీ డేటాబేస్, మిల్లీసెకన్లలో కాల్స్, టెక్స్ సందే శాల నమూనాను పరిశీలించడానికి అభివృద్ధి చేసిన అల్గారిథమ్‌తో కూడిన భద్ర తా ఫిల్టర్లను సమగ్రపరచడం ద్వారా ఎటువంటి ఛార్జీలు లేకుండా కస్టమర్లందరికీ నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్లు పరిష్కా రం చూపాలి. ఇలాంటి ప్రక్రియను ఇప్పటికే ఎయిర్ టెల్  అభివృద్ధి చేసింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నడిచే స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్‌ను ఎయిర్‌టెల్  ప్రారంభించింది. పరిష్కారాన్ని రూపొందించడానికి కంపెనీకి ఒక సంవత్సరం పట్టింది. చరిత్ర ద్వారా, కాల్స్ చేయడాని కి ఉపయోగించే ఫోన్ నంబర్ ఇన్‌కమిం గ్ కాల్స్, మార్పిడి సందేశాలను కూడా తీసుకుంటుందో లేదో అల్గారిథమ్ గుర్తిస్తుంది.

పంపినవారి వినియోగ నమూ నా సిస్టమ్ ద్వారా పరిశీలించబడుతుంది. కాల్స్ లేదా సందేశాల మార్పిడి జరగడం లేదని  గమనించినట్లయితే, సిస్టమ్ అనుమానాస్పద నంబర్‌గా ఫ్లాగ్ చేస్తుంది. వ్యక్తుల ఫిర్యాదులను స్వీకరించడానికి,  ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను కూడా సర్వీస్ ప్రొవైడర్లు పటిష్ట పరచుకోవాలి.  కేంద్ర ప్రభుత్వం 140, 160,  161ని ప్రమోట్ చేసే అన్ని రకాల సర్వీస్‌లు, లావాదేవీల కాల్స్‌కుప్రీఫిక్స్‌గా కేటాయించింది. 

నిజమైన పద్ధతిలో ఆర్థిక ఉత్పత్తు లు లేదా సేవలు అధికారులు, టెలికాం కంపెనీలు స్పామ్ మరియు అయాచిత వాణిజ్య సమాచార మార్పిడికి సహకరిస్తున్నాయని సెప్టెంబర్ 30న టిఓఐ నివే దించింది. టెలికాం శాఖ, రెగ్యులేటర్ ట్రాయ్, ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు సైబర్‌తో ముడిపడి ఉన్న ఈ సమస్యలను ఎదుర్కోవడానికి కొత్త చర్యలను ఏర్పా టు చేసుకోవాలి.

ట్రాయ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్  ప్రకారం కోటికి పైగా మోసపూరిత మొబైల్ కనెక్షన్లు తీసివేయబడ్డాయి. అలాగే  సైబర్ క్రైమ్, ఆర్థి క మోసాలకు పాల్పడినందుకు 2.27 లక్ష ల మొబైల్ హ్యాండ్‌సెట్లు బ్లాక్ చేయబడ్డాయి. ఆగస్ట్‌లో, బల్క్ స్పామ్ కాల్స్ కోసం ఉపయోగించే టెలికాం వనరుల ను డిస్కనెక్ట్ చేయాలని మొబైల్ ఆపరేటర్లను ట్రాయ్ కోరింది.

అలాంటి సంస్థల ను రెండేళ్ల వరకు బ్లాక్‌లిస్ట్ చేయవచ్చని పేర్కొంది. అదనంగా, అక్టోబర్ 1 నుండి టెలికాం కంపెనీలు తప్పనిసరిగా వైట్‌లిస్ట్ చేయని వెబ్ లింక్‌లను కలిగి ఉన్న ఎస్ ఎంఎస్ ప్రసారాన్ని తనిఖీ చేయాలి. ఇది  ఎస్ యంఎస్ హెడర్లు,టెంప్లేట్ల దుర్వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో ఉంది. 

ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ వర్ధమా న్ గ్రూప్ ఛైర్మన్, 82 ఏళ్ల ఎస్‌పీఓస్వాల్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి,  ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అధికారులు గా నటిస్తూ రూ. 7 కోట్ల మోసం చేశారు.  పోలీసులు ఇప్పటివరకు రూ. 5 కోట్లకు పైగా రికవరీ చేయగా, ఈ కేసు దేశంలోనే ముఖ్యమైన మోసం రికవరీలలో ఒకటిగా నిలిచింది.

సికింద్రాబాద్‌కు చెందిన 85 ఏళ్ల వృద్ధుడు రూ.2.8 కోట్ల సైబర్ మోసానికి బలయ్యాడు. ఇలా రాసుకుం టూ పోతే దేశ రాజధాని నుంచి మారుమూల గ్రామాల వరకు నిత్యం మోస పోతున్న వారి సంఖ్య ప్రతి రోజు  వేలల్లో ఉంటున్నది. దీనిని మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అరికట్టగలిగితే  మంచిది.

డా. ముచ్చుకోట సురేష్ బాబు