calender_icon.png 28 April, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలంటే మోదీకి పట్టింపే లేదు.. ఆయన ధ్యాసంతా దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టడమే

24-04-2025 04:30:26 PM

జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్..

మంథని (విజయక్రాంతి): పేదలంటే మోదీకి పట్టింపే లేదు, ఆయన ధ్యాసంతా దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచుపెట్టడమేనని, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్(Block Congress President Thotla Tirupati Yadav) అన్నారు. రామగిరి మండలం రామయ్య పల్లిలో నిర్వహించిన ర్యాలీలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొడ్డ బాప్పన్న, గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన  ర్యాలీలో మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఫోటోలు, రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ప్రజలకు రాజ్యాంగం విలువను తెలుపుతూ తిరుపతి యాదవ్ ర్యాలీ నిర్వహించారు. 

సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీజేపీ పాలనలో రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం లేదని, భారత రాజ్యాంగాన్ని దేశ సమగ్రతను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదముతో పెద్ద ఎత్తున ఉద్యమిద్దమని పిలుపునిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అంటే ప్రధాని మోదీకి ఏమాత్రం విలువ లేదని, అందుకే పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ను కించపర్చే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారని మండిపడ్డారు. భారత రాజ్యాంగం అంటే బీజేపీ దృష్టిలో పుస్తకం మాత్రమేనని, కానీ తమ దృష్టిలో రాజ్యాంగం అంటే పవిత్ర గ్రంథం అని పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే 'జై బాపు, జై భీమ్, జై సంవిధాన్' కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తోట చంద్రయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు బావు రాజమల్లు యాదవ్, యూత్ అసెంబ్లీ మాజీ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రామ్మూర్తి, మాజీ జడ్పీటీసీ గట రమణ రెడీ, మాజీ ఎంపీపీ దేవక్క కొమురయ్య, మాజీ సర్పంచ్ దేవునూరీ రజిత శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బుద్దార్తి బుచ్చయ్య, మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య, మాజీ ఉప సర్పంచ్ నరేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, గొర్రె నరేష్ యాదవ్, పుల్లల కొమురయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు మట్ట రాజ్ కుమార్, అవినాష్, దేవునూరి రాజేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.