హైదరాబాద్: ఫార్ములా- ఈ కారు రేసు కేసులో బీఎల్ఎన్ రెడ్డి(BLN Reddy) ఏసీబీ విచారణ కాసేపటి క్రితమే ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయంలో ఫార్ములా- ఈ కారు రేసింగ్ జరిగింది. హైదరాబాద్ లో ఫార్ములా- ఈ కార్ రేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) కీలకంగా వ్యవహరించారు. ఫార్ములా ఈ కారు రేసులో భారీగా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా- ఈ కారు రేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. కాగా, ఫార్ములా- ఈ కారు రేసు కేసులో శుక్రవారం బీఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణకు హాజరయ్యారు. సుమారు ఆరున్నర గంటలపాటు ఫార్ములా- ఈ కార్ రేసింగ్ లో బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు విచారించారు. మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్( Aravind Kumar IAS) వాంగ్మూలం ఆధారంగా ఏసీబీ అధికారులు బీఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించారు.