calender_icon.png 20 April, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్భిణి స్త్రీలకు శ్రీమంతం

19-04-2025 11:38:33 PM

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మహిళా శిశు సంక్షేమ శాఖ మహబూబ్ నగర్ రూరల్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం పోషన్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా టిఎన్జిఓ భవన్ లో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించారు. చిన్నారులకు అన్నప్రాసన చేశారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ రూరల్ ఎంపిడిఓ కరుణ శ్రీ మాట్లాడుతూ... అంగన్వాడీ కేంద్రాలు పంపిణీ చేసే పోషకాహారాన్ని గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పుట్టబోయే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా  ఉండటానికి పౌష్టికాహారం తప్పనిసరి అన్నారు. ఈ సందర్భంగా వైద్యులు గర్భిణీలకు, పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిడిపిఓ శైల శ్రీ, ఏసిడిపిఓ వెంకటమ్మ, మెడికల్ ఆఫీసర్ నరేష్ చంద్ర, హెల్త్ ఎడుకేటర్ రాజ గోపాలచారి, ఏపిఎం మాధవి, సూపర్ వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.