calender_icon.png 2 February, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీకి వరాలు

02-02-2025 01:21:49 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి) : కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదే శ్‌కు ప్రత్యేక కేటాయింపులు దక్కాయి. ఏపీకి ఎంతో ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో ఈసారి రూ. 5,936 కోట్లను కేటాయించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి మరో 54 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టు అంచనాల పెంపునకూ ఆమోదముద్ర వేశారు.

పోలవరం సవరించిన అంచనాలు రూ. 30,436.95 కోట్లకు ఆమోదం తెలిపారు. పోలవరం బ్యాలెన్స్ గ్రాంట్ రూ. 12,157.53 కోట్లను కేంద్రం ఆమోదించింది. వీటితో పాటు విశాఖ స్టీల్‌పై సైతం కేంద్రం ప్రత్యేక దృష్టిని సారించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు కేటాయించింది. మొత్తంగా ఏపీకి కేంద్ర బడ్జెట్ సంతోషాలను తీసుకువచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. 

ఏపీకి కేటాయింపులు ఇవే..

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు 

విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు 

లెర్నింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఆపరేషన్‌కు మద్దతుగా రూ.375 కోట్లు 

ఏపీ ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు 

2వ దశకు రూ.242.50 కోట్లు 

రాష్ర్టంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ. 240 కోట్లు 

రాష్ర్టంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు రూ. 186 కోట్లు 

రాష్ర్టంలోని ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ. 162 కోట్లు