20-03-2025 12:00:00 AM
ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్
చార్మినార్, మార్చి 19(విజయ క్రాంతి)..ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోం దని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో పాతబస్తీ చౌ ము ల్లా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన ఇప్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసారు.
ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందే లా కృషి చేస్తున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హార్కర వేణుగో పాల్, డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్తో పాటు పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు, ము స్లిం మత పెద్దలు పాల్గొన్నారు.