మండుతున్న ఎండలు
25-05-2026 12:09 AM
- 10 జిల్లాల్లో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- 10 జిల్లాల్లో 45.2 డిగ్రీలు నమోదు
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎండ లు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఆదివారం 10 జిల్లాల్లో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణో గ్రతలు నమోదవగా, మరో 10 జిల్లాల్లో 45.2 డిగ్రీల నుం చి 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
అత్యధికంగా కు మ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 46.5 డిగ్రీలు నమోదైతే అత్యల్పంగా 23.6 డిగ్రీలు మహబూబ్‌నగర్ జిల్లాలో నమోదైంది. కుమ్రంభీం, మంచిర్యాల, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, నల్లగొండ, హన్మకొండ, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో 46.1 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జయశంకర్, మహబూబాబాద్, నిర్మల్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.






