బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఇటీవల తీవ్ర అనారోగ్యంతో మరణించిన తోడే వంశీకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం అమెరికాలో ఉంటున్న అతని సోదరుడు తోడే కృష్ణారెడ్డి బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి, నీల్వయి వసతి గృహాల విద్యార్థులకు స్థానిక నాయకుల ద్వారా రూ 40 వేల విలువగల దుప్పట్లను పంపిణీ చేయించారు. అమెరికా నుండి రూ 40 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడంతో వేమనపల్లి మాజీ జెడ్పిటిసి రుద్రబట్ల సంతోష్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు సాబీర్ , బెల్లంపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముడిమడుగుల మహేందర్ లు దగ్గరుండి విద్యార్థులకు దుప్పట్లను అందజేశారు.