12-03-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 11 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ న్యూ గోదావరి హాస్టల్‌లో భోజనం చేస్తున్న ఓ విద్యార్థి ప్లేట్‌లో బ్లేడ్ ప్రత్యక్షమైంది. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. దీంతో మెస్ అధికారుల తీరు పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విద్యార్థి గమనించకుండా బ్లేడ్ నోట్లోకి వెళ్లి ఉంటే సదరు విద్యార్థి పరిస్థితి ఎలా ఉండేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.