ముంబయి: భారత కార్పొరేట్ రంగంలో మరో భారీ డీల్‌కు రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ స్నాక్స్ కంపెనీ హల్దీరామ్ ఈక్విటీలో 51 శాతం వాటా కొనుగోలుకోసం ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్ జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం హల్దీరామ్ ప్రమోటర్స్‌కు రూ.40, 000 కోట్లు చెల్లించడానికి బ్లక్‌స్టోన్ సంస్థ సిద్ధమయినట్లు తెలుస్తోంది. అయతే రెండు కంపెనీలు కూడా అధికారికంగా దీనిపై పెదవి విప్ప డం లేదు. హల్దీరామ్ మార్కెట్ విలువను రూ.78,000 కోట్లుగా నిర్ధా రించినట్లు తెలుస్తోంది.ఈ కొనుగోలు తర్వాత హల్దీరామ్ బ్రాండ్ మీదనే ఉత్పత్తులు కొనసాగుతాయి. అందుకు హల్దీరామ్ ప్రమోటర్లకు బ్లాక్‌స్టోన్ ఏటా కొంత రాయల్టీ చెల్లించేందుకు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.