16-04-2025 12:00:00 AM
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 15 ( విజయక్రాంతి ): తాను చెప్పినట్టు వినకుంటే స్నానం గదుల్లో తీసిన ఫోటోలు, వీడియోలతో తరచూ బెదిరిస్తున్న టార్చర్ టీచర్ పై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో మంగళవారం మరోసారి చోటుచేసుకుంది.
ఈనెల 6న స్టడీ అవర్స్ కు లేటుగా వచ్చిందన్న సాకుతో 9వ తరగతి చదువుతున్న యామిని అనే విద్యార్థిని ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి మంచినీరు తాగనివ్వకుండా వాష్ రూమ్ కూడా వెళ్ళనివ్వకుండా టార్చర్ చేసిన ఘటనలో మనస్థాపమ్ చెందిన విద్యార్థిని చాకుతో చేతిని కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పా ల్పడింది.
ఈ ఘటనలో సదరు టీచర్ పై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ మంగళవారం పాఠశాల విద్యార్థులంతా మధ్యాహ్న భోజనం చేయకుండా ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ భాస్కర్ రెడ్డి పాఠశాలలకు చేరుకొని విద్యార్థులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశా రు. ఆయనా వినకపోవడంతో డీఈఓ రమే ష్ కుమార్ వారిని సముదాయించారు.
సద రు టార్చర్ టీచర్ పై చర్యలకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కు నివేదించామని వరుసగా సెలవుల నేపథ్యంలో చర్యలకు ఆలస్యం జరిగిందన్నారు. మరో 15 రోజుల్లో శాఖ పరమైన చర్యలు ఉంటాయని హామీ ఇవ్వడం తో నిరసన విరమించారు.
ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి తన ఫ్రస్టేషన్తో విద్యార్థులను చిన్నచిన్న కారణాలతోనే తీవ్ర పరుష పదజాలం తో దూషిస్తూ చెంపదెబ్బలు, గోడ కుర్చీలు వంటివి వేస్తూ టార్చర్ చేస్తుందని ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
బట్టలు మార్చుకుంటుండగా, స్నా నం చేస్తుండగా ఫోటోలు వీడియోలు తీసి ఎవరికో పంపుతోందని విద్యార్థులు ఆరోపించారు. అయినా తనపై చర్యలు తీసుకు నేందుకు అధికారులు ఎందుకు జంకుతున్నారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.