calender_icon.png 10 January, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ రోడ్లు

07-01-2025 12:00:00 AM

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ 

జగిత్యాల అర్బన్, జనవరి 6: తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి బ్లాక్ స్పాట్ రోడ్లను నిర్మించడం వల్ల ప్రమాదాలు రోడ్డు తగ్గుతాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ఆర్టీఏ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం 2025 సడక్ సురక్ష అభియాన్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

వాహనదారులకు రోడ్డు ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంజయ్’కుమార్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు ప్రమా దం భారిన పడకుండా జాగ్రత్తలు పాటించడం ప్రతి ఒక్కరి భాధ్యత అని అన్నారు. బైక్, కారు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్,సీట్ బెల్ట్ ను పెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు.

జగిత్యాల నుండి చల్గల్ వరకు బ్లాక్ స్పాట్ రోడ్డు వేయటం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నా రు. జగిత్యాల నుండి అనంతారం వరకు సైతం బ్లాక్ స్పాట్ నాలుగు లైన్ల రహదారికి కృషి చేస్తు న్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లి దండ్రులు జాగ్రత్త వహించాల న్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా పాటించాల్సింది ప్రజలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, ఎంవీఐ వెంకన్న, రామరావు, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.