- బీజేపీ సిద్ధాంతాలతో రాజ్యాంగం ప్రమాదంలో పడింది
సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్
సంగారెడ్డి, జనవరి 26 (విజయ క్రాం తి) : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కార్మిక రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకు వచ్చిందని, రైతుల పోరాటంతో కేంద్ర ప్రభుత్వం వెనుకకు తగ్గిందని సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్ తెలిపారు. ఆదివారం సంగారెడ్డి పట్టణం లో తెలంగాణ రాష్ర్ట సీపీఐ (ఎం) 4వ మా సభలో పాల్గొని ప్రసంగించారు. రైతుల పోరాటంతో వెనుకకు తగ్గిన కేంద్ర ప్రభు త్వం ఇప్పుడు మళ్లీ నల్ల చట్టాలు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపిం చారు. దేశ సంపదలు 20 శాతం ఆదానీ, అంబానీ, టాటా, బిర్లాలు కబ్జా చేశార న్నారు.
బిజెపి పాలిత రాష్ట్రాలలో ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకు రావడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం హిందుత్వ సిద్ధాంతం, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా రెండు పిల్లర్లపై మోడీ ప్రభుత్వం నడుస్తుందన్నారు. బీజేపీ ప్రభు త్వ నిర్ణయాలతో రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయిందన్నారు. భారతదేశాన్ని ఒకే మతానికి పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆరోపిం చారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేసేవారు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి ఎదురు దెబ్బ తగిలింది అన్నారు. భారత ప్రభుత్వం విద్యాశాఖ నిర్ణయాలు అమెరికాకు అను కూలంగా తీసుకుంటుందన్నారు. మోడీ ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యానికి దాసో హంగా మారిందన్నారు. ప్రపంచంలోని కొన్ని దేశాలలో లెఫ్ట్ పార్టీలకు ఆదరణ పెరుగుతుందని, శ్రీలంకలో అధ్యక్ష లిఫ్ట్ పార్టీకి దక్కిందన్నారు.
అమెరికా అధ్యక్షు లుగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో రాజకీయ పరి మాణాలు వేగంగా మారిపోతున్నాయన్నారు. సిపిఎం జాతీయ మహాసభలను మదురైలో నిర్వహించేం దుకు ఏర్పాట్లు జరుగుతున్నా యన్నారు. తెలంగాణ రాష్ర్ట మహాసభల్లో ఏచూరి లేకపోవడం పార్టీకి తీరని లోటు అన్నారు. మధురై లో జరిగే జాతీయ మహాసభల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నారు.
గణతంత్ర వేడుకలు
రాష్ర్ట 4వ మహాసభలు జరుగుతున్న గోకుల్ ఫంక్షన్ హాల్ వద్ద జాతీయ జెండా పోలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, తెలంగాణ రాష్ర్ట సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జయరాజ్, నాయకులు కే రాజయ్య, మాణిక్యం పాల్గొన్నారు.