calender_icon.png 19 April, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీదర్ టూ మానుకోట

16-04-2025 07:13:26 PM

నల్లబెల్లం అక్రమ రవాణా..

48 బస్తాల నల్ల బెల్లం పట్టివేత..

మహబూబాబాద్ (విజయక్రాంతి): కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి మహబూబాబాద్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో గుడుంబా తయారీకి వినియోగించే నిషేధిత నల్ల బెల్లం, పటికను బొలెరో వాహనంలో అక్రమంగా తెస్తుండగా విశ్వసనీయ సమాచారంతో జిల్లాలోని నెల్లికుదురు మండల కేంద్రానికి సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. నెల్లికుదురు ఎస్ఐ చిర్రా రమేష్ బాబు కథనం ప్రకారం... కేసముద్రం మండలం గాంధీనగర్ కు చెందిన బదావత్ సురేష్, మహబూబాబాద్ మండలం వేమునూరు రాయకుంట తండకు చెందిన భూక్యా చందు, ఇనుగుర్తి మండలం కోమటిపల్లికి చెందిన సపావట్ సంతోష్, కురవి మండలం జగ్గ్యా తండాకు చెందిన కేలోత్ హరి సింగ్ కలిసి బీదర్ నుంచి అక్రమంగా నల్ల బెల్లం, పటిక రవాణా చేస్తున్నారని ఎస్సై తెలిపారు. 2.50 లక్షల విలువైన 48 బస్తాల నల్ల బెల్లం, 2 బస్తాల పటిక, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకొని నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.