సూర్యాపేట, డిసెంబర్ 22 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారు జామున ఎక్సైజ్ అధికారులు భారీగా నల్లబెల్లం, పటిక స్వాధీనం చేసుకున్నారు. తుంగతుర్తి ఎక్సైజ్ సీఐ రజిత తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి పోలీసులు, సూర్యాపేట టాస్క్‌ఫోర్స్ బృందం తెల్లవారుజామున వెలిశాల క్రాస్‌రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. తుంగతుర్తి నుంచి వస్తున్న లారీని తనిఖీ చేయగా 30 టన్నుల నల్లబెల్లం, క్వింటాలు పటిక, 20 లీటర్ల సారా పట్టుబడింది. బస్తాలను స్వాధీ నం చేసుకొని లారీ డ్రైవర్ గంగారాంను అదుపులోకి తీసుకున్నారు. ఈ దందాతో సంబంధమున్న వినీత్, షేక్ ఫరూక్ పరారీలో ఉన్నట్లు సీఐ రజిత తెలిపారు.