calender_icon.png 15 January, 2025 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్కల దాడిలో కృష్ణజింకకు గాయాలు

08-08-2024 01:02:10 AM

నిజామాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ పరిసరాల్లోకి మేతకు వచ్చిన కృష్ణజింకపై కుక్కలు దాడి చేశాయి. గమనిం చిన గ్రామస్థులు జింకను కాపాడి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. నందిపేట్ మండలం అన్నారం ఎస్సా రెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలోకి బుధవారం కృష్ణజింక వచ్చింది. మేత మేస్తుండగా వీధికుక్కలు దాడి చేశాయి. గ్రామస్థులు కుక్కల బారి నుంచి జింక ను కాపాడి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుధాకర్, వెటర్నరీ వైద్యుడితో కలిసి ఘటనా స్థలానికి వచ్చారు. అనంతరం జింకకు వైద్యం చేసి పర్యవేక్షణ కోసం చిన్నాపూర్  అర్బన్ పార్క్‌కు తరలించారు.