కామారెడ్డి జిల్లా పిట్లం గద్ద గుండ తండా వద్ద 161వ జాతీయ రహదారిపై ఘటన
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గద్దగుండ తండా వద్ద 161వ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం కృష్ణ జింకను ఢీకొనడంతో గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న జాతీయ రహదారి సిబ్బంది అంబులెన్స్‌లో పిట్లం పశువైద్యశాలకు తరలించారు. పశువైద్యాధికారి సంతోష్ జింకకు వైద్యం అందించారు. అనంతరం జాతీయ రహదారి సిబ్బంది కృష్ణ జింకను అటవీశాఖ అధికారులకు అప్పగించారు.