12-04-2025 12:59:27 AM
బీజేపీ నేత ఎన్వీ సుభాష్
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): అహ్మదాబాద్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనీ యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ తీవ్రంగా ప్రతిస్పందించింది.
రాష్ర్ట రాజకీయాల్లో బీజేపీకి తావు ఇవ్వబోమని రేవంత్ చేసిన వ్యాఖ్యలు నిస్సారమైనవని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ శుక్రవారం ఒక ప్రకట నలో పేర్కొన్నారు. కామారెడ్డిలో ఆయనకు ఎదురైన ఘోర ఓటమిని రేవంత్‌రెడ్డి మర్చిపోయారా అని ప్రశ్నించారు. 2023లో బీజేపీ రాష్ట్రంలో 8 అసెం బ్లీ స్థానాలను గెలుచుకుందని.. అందులో రేవంత్‌రెడ్డి సిట్టింగ్ స్థానం మల్కాజిగిరితో పాటు సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్ కూడా ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాల నూ బీజేపీ గెలిచిందన్నారు. తికమకపెట్టి బురదజల్లే వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేది ఖాయమని, అలాగే కాంగ్రెస్ పతనం తథ్యమని స్పష్టం చేశారు.