17-04-2025 12:00:00 AM
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి
కరీంనగర్, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం తమ ఆస్తులను, ప్రాణాలను త్యాగం చేసిన గాంధీ కుటుంబం పై బీజేపీ ప్రతికార చర్యలకు పాల్పడుతోందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్ పత్రిక కేసు లో చార్జ్ షీట్ లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ల పేర్లు నమోదు చేసి బీజేపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇన్కమ్ టాక్స్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆరెపల్లి మోహన్ లు మాట్లాడుతూ బిజెపి కేంద్రంలో అధికారం చేపట్టిన నాటినుండి కాంగ్రెస్ పార్టీపై దాడులు కొనసాగుతున్నాయి,
దేశవ్యాప్తంగా కార్యకర్తల, అభిమానుల విరాళాలతో నడిపించిన నేషనల్ హేరాల్ పత్రికకు అక్రమ ఆస్తులను అంటగడుతూ కుట్ర పూరితంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన సోనియా రాహుల్ గాంధీ లపై కేసులు పెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై . ఇప్పటికైనా బిజెపి తమ బుద్ధి మార్చుకోకపోతే మా నిరసనలను దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించి నారు. ఈ కార్యక్రమంలో డిసిసి వర్కింగ్ ప్రె సిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నాయకులు వైద్యుల అంజన్ కుమార్, గడ్డం విలా స్ రెడ్డి, బానోతు శ్రవణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, సమద్ నవాబ్, మల్యాల సుజిత్ కుమార్, ఆకారపు భాస్కర్ రెడ్డి, మల్లికార్జున రాజేందర్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, దన్నా సింగ్, బొబ్బిలి విట్టర్, నిహాల్, వంగల విద్యాసాగర్, కర్ర రాజశేఖర్, అహ్మద్ అలీ, చర్ల పద్మ, ఎస్‌ఏ మోసిన్, కుర్ర పోచయ్య, దిండిగాల మధు, మాదాసు శ్రీనివాస్, మూల జైపాల్ పాల్గొన్నారు.