calender_icon.png 19 November, 2024 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీవి విధ్వంస రాజకీయాలు

19-11-2024 01:15:51 AM

  1. మోదీకి ఎరుపంటే ఎందుకంత భయం?
  2. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క

హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాం తి): సమాజాన్ని, కుటుంబాలను చీలుస్తూ బీజేపీ విధ్వసం రాజకీయాలకు పాల్పడుతున్నదని మంత్రి సీతక్క విమర్శించారు. మహా రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బల్లార్హా, చంద్రాపూర్, రజురా నియోజకవర్గాల్లో మంత్రి సీతక్క పర్యటించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పార్లమెంట్‌లో రాహుల్‌గాంధీ ఎరుపురం గు కవర్‌తో ఉన్న రాజ్యాంగ పుస్తకాన్ని చూపిస్తే ప్రధాని మోదీ భయపడుతున్నారు.. మోదీకి ఎరుపంటే ఎందుకంత భయం’ అని ప్రశ్నించారు. బీజేపీ దేశానికి ప్రమాదకారిగా మారిందని హెచ్చరించారు. అదానీ, అంబా నీ, ప్రధాని ఒక్కటై దేశాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు.

దోపిడీ సొమ్మును ఎన్ని కల్లో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తే తెలంగాణ తరహాలోనే గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమిని గెలిపించి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు.