calender_icon.png 8 January, 2025 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీవి దిగజారుడు రాజకీయాలు

08-01-2025 01:42:37 AM

ప్రియాంక గాంధీపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలను ఖండించరా?

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాం తి):బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని,  ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. మంగళ వారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీపై బీజేపీ ఢిల్లీ నేత రమేశ్ బిధూరీ చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ నేతలు ఖండించాల్సిందిపోయి.. ప్రోత్సహించే విధంగా మా ట్లాడటం సిగ్గుచేటన్నారు. 

‘మీరు రెచ్చగొడితేనే మా వాళ్లు రెచ్చిపోతారు.. కాంగ్రెస్ బలం ముందు బీజేపీ బలం సరిపోతుం దా..?” అని హెచ్చరించారు. ప్రియాం కగాంధీపై చేసిన బీజేపీ నాయకుడు చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు నిరసనగానే యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారన్నారు.  ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ కూడా ఖండించడంతోపాటు యూత్ కాంగ్రెస్‌ను కూడా హెచ్చరించారని తెలిపారు.

కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి,  బండి సంజ య్ బీజేపీ కార్యకర్తలను సమన్వయం చేయాల్సిందిపోయి.. ప్రోత్సహించే లా వ్యవహారించారని మండిపడ్డారు. రాజాసింగ్ గాంధీభవన్‌ను పేలుస్తా అంటున్నాడని, ముందు ఆయన బీజేపీ ఆఫీసులోకి ఎంట్రీ తెచ్చుకోవాలని, ఆ తర్వాత గాంధీభవన్‌కు రావాలని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.