08-04-2025 12:00:00 AM
జహీరాబాద్ ఎంపీ, ఖేడ్ ఎమ్మెల్యే
నారాయణఖేడ్, ఏప్రిల్ 7: బిజెపి అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమాన పరిచే విధంగా వ్యవరిస్తుందని ఆరోపించారు.
బిజెపి విధానాలను గ్రామస్థాయిలో ఎండగట్టాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రత్యేక ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
కార్యక్రమంలో జై బాబు జై సంవిధాన్ నారాయణఖేడ్ ఇన్చార్జి ధనలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాకేష్ షట్కర్, కర్ని శ్రీనివాస్, పి. విట్టల్ రెడ్డి, రమేష్ చౌహన్, లక్ష్మీ బాయి, వినోద్ పాటిల్, మైనార్టీ నాయకులు తాహెర్, శ్రీకాంత్ రెడ్డి , జనార్ధన్ పాల్గొన్నారు.