calender_icon.png 9 January, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్‌కు బీజేపీ అవమానం

07-01-2025 01:08:52 AM

* పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు 

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించిన బీజేపీ నేతలను తీరగనీయవద్దని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అన్నారు. ప్రజలను రెచ్చగొట్టి హిందూదేశంగా మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. సోమవారం వీహెచ్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఇండియా సెక్యులర్ దేశమని స్పష్టంచేశారు.

ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు ఉంటే అక్కడ హనుమంతరావు ఉంటాడని చెప్పా రు. అంబేద్కర్‌కు అవమానం చేసిన అమిత్‌షా పెద్ద నాయకుడు ఎలా అవుతారని? ప్రశ్నించారు. పార్లమెం ట్ సాక్షిగా అంబేద్కర్‌కి అవమానం జరిగినా తెలంగాణ బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.

అమిత్ షా మీద కేసు పెట్టేవరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. 2019లో పంజాగుట్ట చౌరస్తాలో జైభీమ్ కార్యకర్తలకు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే పర్మిషన్ లేదని అధికారులు ఆ విగ్రహాన్ని కూల్చివేశారని, రాజ్యాంగం రాసిన అంబేద్కర్‌పై కనీస మర్యాద లేకుండా వ్యవహారించారని మండిపడ్డారు.