calender_icon.png 13 January, 2025 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ విద్వేషానికి అడ్డుకట్ట వేయాలి

04-12-2024 03:35:03 AM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత 

హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): దేశంలో బీజేపీ ప్రోత్స హిస్తున్న విద్వేశానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  పేర్కొన్నారు. రాష్ర్టంలో లౌకికత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంద న్నారు. మంగళవారం తన నివాసంలో క్రిస్టియన్ సంఘాల నాయకు లు కలిశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ లౌకికతత్వ పరిరక్షణకు కేసీఆర్ ఎనలేని కృషి చేశారని, భవిష్యత్తులోనూ అదే పంథాలో ముం దుకు వెళతామన్నారు.

ఏడాది కాంగ్రె స్ పాలనలో అనేక మతకల్లోలాలు జరిగాయని, ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో ఉన్న సామాజిక స్వరూపాన్ని, లౌకికతత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌తోనే క్రిస్టియన్లతో సహా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో ప్రేయర్ పవర్ ఫౌండర్ శామ్ అబ్రహం, ఎల్బీ నగర్ పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు జేకబ్, మెడికల్ మిషన్ జవహార్ కెన్నెడీ, కూకట్‌పల్లి అసోసియేషన్ రేవరెండ్ ఇజ్రెల్, రెవరెండ్ దేవదానం, పాస్టర్ సాపా శ్రీనివాస్, పాస్టర్ అరవింద్, సాల్వేషన్ ఆర్మీ చర్చి మేజర్ ఫిలిప్ రాజ్, లెఫ్టినెంట్ హేమా సునీల్, తదితరులు ఉన్నారు.

కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను పెంచి బీసీ మహిళలకు కోటా కల్పించాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నామని ఎమ్మెల్సీ కవిత చెపారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో గంగపుత్ర సంఘం నేతలు ఆమెను కలిశారు. ఇటీవల తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు కులగణనపై నివేదిక ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.