calender_icon.png 17 April, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీది ద్వేషభాష!

09-04-2025 01:08:42 AM

  1. మతరాజకీయాలతో దేశం అధోగతి
  2. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
  3. ప్రజల హక్కుల కోసం రాజీ లేని పోరాటం
  4. ఏఐసీసీ అగ్రనేత రాహుల్
  5. అహ్మదాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశం

అహ్మదాబాద్, ఏప్రిల్ 8: కేంద్రంలోని బీజేపీ ప్రజల మధ్య మతపరమైన రాజకీయాలకు పాల్పడుతున్నదని, ఆ పార్టీకి ద్వేష పూరితమైన భాష మాత్రమే తెలుసునని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతి రేక విధానాలతో భారత్ అధోగతి పాలవుతున్నదని ఆరోపించారు.

గుజరాత్ రాజధాని అహ్మదాబా ద్‌లో మంగళవారం అగ్ర నాయనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఆధ్వర్యం లో ‘న్యాయపథ్, సంకల్ప్, సమర్పణ్, సంఘ ర్ష్’ పేరిట కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. సమావేశా నికి దేశవ్యాప్తంగా సుమారు 170 మంది నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి అందించిన సేవల ఉద్ఘాటన జరిగింది.

ఆర్‌ఎస్‌ఎస్ బీజేపీ కలిసి పటేల్‌ను తమ వాడిగా ప్రచారం చేసుకుంటున్నాయని, వా టని పార్టీ శ్రేణులు సమర్థంగా తిప్పికొట్టాల నే తీర్మానం జరిగింది. అలాగే నెహ్రూ, పటే ల్ మధ్య మంచి అనుబంధం ఉన్నప్పటికీ, ఆర్‌ఎస్‌ఎస్ బీజేపీ పనిగట్టుకుని విభేదాలున్నట్లు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులు తీర్మానించాయి. 

అనంతరం మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వం టి జాతీయ నాయకులపై  బీజేపీ, ఆర్‌ఎస్‌ఎ స్ కుట్రలు చేస్తున్నాయనిఆరోపించారు. నె హ్రూ, పటేల్ ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నారని, వారిద్దరూ దేశ ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేశారని, వారి మధ్య విభేదాయ లున్నాయని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ప్రచారం చేస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.

నెహ్రూ ప్రధాని పదవిలో ఉండి కూడా ఆయనకు ఏదైనా సందేహం వద్ద స్వయంగా పటేల్ నివాసానికి వెళ్లేవారని గుర్తుచేశారు. వారిద్దరి మధ్య నిరంతరం ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవని స్పష్టం చేశారు. నెహ్రూ కొన్నిసార్లు కేవలం పటేల్ సౌలభ్యం కోసమే సీడబ్ల్యూసీ సమావేశాలు ఆయన ఇంట్లో నిర్వహించే వారని గుర్తుచేశారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ భావజాలానికి పూర్తి వ్యతిరేకమని, అయినప్పటికీ పటేల్‌కు వాటిని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

స్వాతంత్య్రోద్యమం లో పాల్గొనని వారంతా తామిప్పుడు పటేల్ వారసులమని చెప్పుకుంటున్నారని నిప్పు లు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ల నుంచి దేశ సేవలు ఉందని, స్వాతంత్య్రోద్యమంలో ముఖ్యభూమిక పోషించిందని ఖర్గే కొనియాడారు. అంతటి చరిత ఉన్న పార్టీని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ అంతం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్ అంబేద్కర్‌కి రాజ్యసభ సభ్యుడి పదవి కట్టబెట్టడంలో మహాత్మాగాంధీ, పటేల్ ముఖ్యపాత్ర పోషించారని కొనియాడారు.

అంబేద్కర్ తన చిట్ట చివరి ప్రసంగంలో ‘కాంగ్రెస్ మద్దతు లేకుం డా రాజ్యాంగాన్ని సిద్ధం చేసేందుకు అడుగులు పడేవి కావు’ అని కొనియాడారని గుర్తుచేశారు. అంతగొప్ప రాజ్యాంగం అమలులోకి వస్తే నాడు ఆర్‌ఎస్‌ఎస్ నేతలు, కార్యకర్తలు రాజ్యాంగ ప్రతులతోపాటు జాతీయ నాయకుల దిష్టిబొమ్మలను దహ నం చేశారని వెల్లడించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ను అవమానించిన తీరును ఎండగట్టారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను పక్కన పెట్టడంలోనే ప్రధాని మోదీ కుటిలత్వం బయటపడిందని అభిప్రాయపడ్డారు. 

ప్రజాస్వామిక సంస్థ కాంగ్రెస్: రాహుల్‌గాంధీ

ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. భారత ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ రాజీ లేని పోరాటం చేస్తుందని, అలాగే వారిని జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకూ పనిచేస్తామని వెల్లడించారు. రైతుల హక్కుల సాధన కోసం పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీలు గళమెత్తుతున్నాయని, పంటకు మద్దతు ధర డిమాండ్ సాధన కోసం పోరాడుతున్నాయని వెల్లడించారు. అలాగే కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను భగ్నం చేస్తున్నదని వివరించారు. చివరగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజాస్వామిక సంస్థలానే పనిచేస్తుందని స్పష్టం చేశారు.

ప్రధాన తీర్మానాలు..

*బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ విద్వేష పూరిత రాజకీయాలు చేస్తున్నాయి. దేశాన్ని అగాధంలోకి నెట్టివేస్తున్నాయి. ఆ చర్యలన్నింటినీ నిరోధించాలి. తద్వారా పటేల్ వారసత్వాన్ని నిలబెట్టాలి. పటేల్ ఆశయ సాధన కోసం శక్తివంచన లేకుండా పనిచేయాలి. ఆయన అనుసరించిన జీవిత సూత్రాలను పాటించాలి.

*కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు ప్రతి జిల్లాలోనూ పార్టీని బలోపేతం చేయాలి. బలమైన జిల్లా కమిటీలను నియమించాలి. పార్టీ జిల్లా అనుబంధ సంఘాల్లోనూ ప్రభావశీల నేతలను ఎన్నుకోవాలి.

*సాంస్థగత నాయకత్వాలకే నిర్ణయాధికారాల కల్పన సొమ్మసిల్లి పడిపోయిన చిదంబరం..

సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం ఉన్నట్టుండి సొమ్మసిల్లి పడిపోయారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆయన్ను సమీప ఆస్పత్రికి తరలించారు. డీహైడ్రేషన్ కారణంగా ఆయన అస్వస్థతకు గురయ్యారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు.

ప్రియాంకా గాంధీ గైర్హాజరుపై వివరణ..

అహ్మదాబాద్ సీడబ్ల్యూసీ సమావేశానికి ప్రియాంకా గాంధీ గైర్హాజరు కావడంపై ఆ పార్టీ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ వివరణ ఇచ్చారు. ప్రియాంక విదేశీ పర్యటనలో ఉన్నందు వల్లే సమావేశానికి హాజరుకాలేకపోయారని స్పష్టం చేశారు.

తెలంగాణ నుంచి సీఎం, డిప్యూటీ సీఎం హాజరు..

సీడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క హాజరయ్యారు.