calender_icon.png 19 April, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

07-04-2025 01:12:08 AM

కరీంనగర్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ 45వ వ్యవస్థాపక ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లోబిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్  పాల్గొని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కరీంనగర్ పట్టణంలోని విద్యానగర్, 38వ డివిజన్  361వ పోలింగ్ బూత్ లలో  జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొని పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 45 ఏళ్ల  ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలను ఎదుర్కొని నేడు ఈ స్థాయికి చేరుకుందన్నారు.

జాతీయ భావజాలం, సిద్ధాంత బలంతో పార్టీ ప్రపంచంలోనే  నెంబర్ వన్ స్థాయికి చేరుకుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ బిజెపి యేనన్నారు. దేశం కోసం ధర్మ బద్దంగా పనిచేసే బిజెపి పాలన పట్ల  ప్రజలంతా విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. దేశంలో రెండు ఎంపీ స్థానాలతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం నేడు వరుసగా మూడుసార్లు దేశాన్ని ఏలే స్థితిలో ఉందని, 16రాష్ట్రాలలో బిజెపి స్వతహాగా అధికారంలో ఉండి, ఆరు రాష్ట్రాల్లో కూటమి ద్వారా ప్రభుత్వాలను కొనసాగిస్తుందన్నారు.

కోట్లాదిమంది కార్యకర్తల నిబద్ధత, జాతీయ భావం కారణంగానే బిజెపి ముందుకెళ్తున్నదని,  పార్టీ కోసం ఎంతోమంది తన జీవితాలను త్యాగం చేశారని, ప్రజల సేవయే ముఖ్యంగా, దేశాభివృద్ధి లక్ష్యంగా పార్టీ పనిచేస్తున్నదని తెలిపారు. నగరంలోని ఆయా ప్రాంతాల్లో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బిజెపి నాయకులు నరహరి లక్ష్మారెడ్డి , జాడి బాల్ రెడ్డి, కోమల ఆంజనేయులు, ఏల్కపల్లి రమేష్, గుండారపు సంపత్, రెడ్డి శ్రీనివాస్, శీతాల రమేష్ చంద్ర, బండ రాకేష్, న్యాత ప్రవీణ్, భగత్ సేన, ఈశ్వర్, ఆంజనేయులు, మామిడి రమేష్, కొంగల రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

28వ డివిజన్లో 

కరీంనగర్, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి): నగరం లోని 28వ డివిజన్ ఈస్ట్ జోన్ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొని పార్టీ జెండాను ఆవి ష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్  గొట్టేము క్కల రమణ ఉమాదేవి, బిజెపి నాయకులు పాల్గొన్నారు.