07-04-2025 01:02:39 AM
హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి
హనుమకొండ, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): బిజెపి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా హనుమకొండ హంటర్ రోడ్డు దీన్ దయల్ నగర్ లోని బిజెపి జిల్లా కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, జెండా ఎగురవేశారు జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు రావు పద్మ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేనీ ధర్మారావు లు నాయకులకు, కార్యకర్తలకు ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతు జాతీయ భావజాలం కోసం, పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన వారందరికీ నివాళులర్పిస్తున్నామని, ముఖ్యంగా దేశంలో అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలో ఉత్తమ విలువలతో, నైతిక విలువలతో పార్టీ కోసం, దేశం కోసం పనిచేయాలని పిలుపునివ్వడం జరిగిందని, పార్లమెంటులో ఒక్క ఓటు తగ్గితే, వేరే పార్టీలకు చెందిన నాయకులు, పార్లమెంటు సభ్యులు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా,
ఆ మద్దతును నిరాకరిస్తూ ఒక్క ఓటుతో ప్రధానమంత్రి పదవిని, కేంద్ర ప్రభుత్వాన్ని వదులుకున్న చరిత్ర భారతీయ జనతా పార్టీది, నైతిక విలువల కోసం, ఉత్తమ విలువలతో పనిచేసే పార్టీ బిజెపి అని, నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి అని, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక సంస్కరణలు,
విదేశీ దౌత్యనీతి. జమ్మూలో 370 ఆర్టికల్ ఎత్తివేత, వక్ఫ్ బోర్డు బిల్లు ఇలా అనేక రకాలుగా మోదీజీ నేతృత్వంలో నభూతో, నభవిష్యత్ అనే విధంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తు, బిజెపి పనిచేస్తు అవినీతి లేకుండా, సమర్థవంతమైన పాలన అందించిన ఘనత బీజేపీదే అని, రాష్ట్రంలో ఎవ్వరినీ అడిగినా రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది బిజెపి యేనని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
కాబట్టి బిజెపి నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కొరకు అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
భీమదేవరపల్లిలో..
భీమదేవరపల్లి, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి) భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 46వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం జరిగింది. పార్టీ జెండా ఆవిష్కరించిన తదనంతరం శ్రీరామోజు శ్రీనివాస్ మాట్లాడుతూ 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది. అప్పడి నుండి ఇప్పటి వరకు నిక్సాన నిజాయితీగల కాషాయ కార్యకర్తలు పార్టీ లో పనిచేస్తున్నారు.
అంటే అది ఒక భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమన్నారు. ఇప్పటివరకు ప్రపంచంలోనే నెంబర్ వన్ పార్టీ అంటే కేవలం కార్యకర్తల క్రమశిక్షణ తో మాత్రమే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యం అయిందన్నారు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. భీమదేవరపల్లి మండలంలో స్థానిక సంస్థల్లో కూడా వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ,జడ్పీటీసీ వరకు కాషాయ జెండా రెపరెపలాడే వరకు పోరాటలు చేస్తామన్నారు .
10 సంవత్సరాల కాలంలో టిఆర్‌ఎస్ పార్టీ ఏ విధంగా రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేసిందో అంతకంటే ఎక్కువ అప్పుల ఊబిలోకి నెట్టింది రేవంత్ రెడ్డి పాలనలో 15 నెలల్లోనే ఆ పరిస్థితి రావడం చాలా బాధాకరం అన్నారు. తెలంగాణ అభివృద్ధి పథంలోకి వెళ్లాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ భారతీయ జనతా పార్టీ అని ఇప్పటికే పలువురు గ్రామాలలో చిన్నపిల్లల నుంచి పెద్దలవరకి భారతీయ జనతా పార్టీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని మాట్లాడడం గర్వకారణం అన్నారు.
ఇదేరేపటి భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి బలమైన నమ్మకం. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దొంగల కొమురయ్య, జిల్లా కౌన్సిల్ మెంబర్ పైడిపల్లి పృథ్వీరాజ్ జిల్లా నాయకులు మాచర్ల కుమారస్వామి, ఊస కోయిల కిషన్, కోడేటి బిక్షపతి, గుండెల్ని సదానందం, దొంగల వేణు, మహిళా నాయకురాలు అంబీర్ కవిత, అరుణాకర్ రెడ్డి,
బండారి కరుణాకర్, బైరి సదానందం, శనిగారపు ఐలయ్య, లక్కిరెడ్డి మల్లారెడ్డి, దొంగల రాణా ప్రతాప్, బుజ్జపురి పృథ్వీరాజ్, బైరి సదానందం, ఆలేరు వికాస్, గద్ద రాజేందర్, నోముల బిక్షపతి,జ్ఞానేశ్వర్, ,మాడుగుల అజయ్, సిద్ధమల్ల రమేష్, గొల్లపల్లి నవీన్, బోడ రమేష్ తదితరు పాల్గొన్నారు.