calender_icon.png 21 April, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేడుకగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

07-04-2025 12:40:22 AM

బాన్సువాడ ఏప్రిల్ 06(విజయ క్రాంతి){ భారతీయ జనతా పార్టీ బాన్సువాడ పార్టీ కార్యాలయంలో అనగా ఆదివారం నాడు బిజెపి 45 వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో బిజెపి జెండా ఎగరడం జరిగింది .

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండల లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ 1980 ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది.నాటి నుండి నేటి వరకు Nation First - Party Second- Self Last అనే నినాదంతో ముందుకు వెళ్ళుతూ అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆధారంగా పనిచేస్తూ, పార్టీ 2 ఎంపీ సీట్లతో ప్రారంభమై, నేడు 15 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నామంటే, కోట్లలాది మంది కార్యకర్తల నిబద్ధత, జాతీయభావం కారణంగా..

పార్టీకోసం తమ జీవితాలను త్యాగం చేసిన నాయకులు మరియు కార్యకర్తలందరినీ స్మరణ చేసుకుంటూ కార్యకర్తలందరికీ ‘పార్టీ ఆవిర్భావ దినోత్సవ‘శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ మాజీ అసెంబ్లీ కన్వీన ర్ చీదర్ సాయిలు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ బిజెపి సీనియర్ నాయకులు ర్యాల మోహన్ రెడ్డి బునపురం  విఠల్ రెడ్డి కొనల గంగారెడ్డి చిరంజీవి పాశం భాస్కర్ రెడ్డి శ్రీకాంత్ అశ్విన్ భూమేష్ సాయి సిద్ధార్థ రామకృష్ణ కొండని గంగారం శంకర్ సిద్ది బాలరాజ్ సుధాకర్ గుడుగుట్ల అనిల్ సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.