నేటి నుంచి కొనుగోలు కేంద్రాల పరిశీలన
హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో వడ్లు, పత్తి కొనుగోళ్లపై బీజేపీ దృష్టి సారించింది. ఆ పార్టీ నేతలు క్షేత్రస్థాయికి వెళ్లి రైతుల సమస్యలపై గొంతెత్తేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికై కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నేటి నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇందుకోసం ౯ బృందాలను ఏర్పాటు చేశారు. 9, 11, 13 తేదీల్లో ఉమ్మడి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను బీజేపీ బృందాలు పరిశీలిస్తాయి.