calender_icon.png 17 April, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర

08-04-2025 12:00:00 AM

ఎమ్మెల్యే మురళి నాయక్ 

మహబూబాబాద్, ఏప్రిల్ ౭: (విజయక్రాంతి): రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత మనందరిపై ఉందని మానుకోట ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను ఎమ్మెల్యే మురళి నాయక్ డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది.

కాగా ఏఐసిసి మరియు టిపిసిసి పిలుపుమేరకు గూడూరు మండల కేంద్రంలో జై  బాపు జై భీమ్ జై సం విధాన్ పాదయాత్రను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేడ్కర్, మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగాన్ని అపహేళన చేస్తుందని విమర్శించారు.

అనంతరం రాజ్యాంగాన్ని ప్రతీ ఒక్కరు పరిరక్షించాలని ప్రతిజ్ఞ చేయించారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించే గొప్ప పత్రిక. ఇది మన దేశాన్ని ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు నడిపే దీపస్తంభం. అలాంటి రాజ్యాంగాన్ని రక్షించడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత‘ అని అన్నారు.

ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం కల్గించి, రాజ్యాంగ విలువల పట్ల అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టబడిందని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

అర్హుల ఎంపికలో అక్రమాలకు పాల్పడవద్దు ప్రభుత్వ పథకాలకు లబ్దిదారుల ఎంపిక లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అక్రమాలకు పాల్పడవద్దని ఎమ్మెల్యే  డా.మురళీ నాయక్ అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.